కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చిట్యాలపల్లి పరిసర పొలాల్లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. నాలుగు రోజుల నుంచి పొలాల్లో చిరుత సంచరిస్తుండటంతో గ్రామస్థులు, రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. అప్రమత్తమై.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
చిట్యాలపల్లి పొలాల్లో చిరుత సంచారం.. భయాందోళనలో రైతులు - కరీంనగర్ జిల్లాలో చిరుత సంచారం
కరీంనగర్ జిల్లా చిట్యాలపల్లి పొలాల్లో చిరుత సంచారం.. గ్రామస్థులు, రైతులను భయాందోళనలకు గురి చేస్తోంది. అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని చిరుత పాదముద్రలను పరిశీలించారు. రైతులు ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని సర్పంచ్ సూచించారు.
చిట్యాలపల్లిలో చిరుత సంచారం
సెక్షన్ అధికారి వేణు భరన్.. పొలాలకు చేరుకుని చిరుత పాదముద్రలను పరిశీలించారు. రైతులు ఒంటరిగా వెళ్లవద్దని సర్పంచ్ సురేష్ చాటింపు చేయించారు. నిర్జన ప్రదేశంలో సుమారు 30 మంది యువకులతో కలిసి చిరుత కోసం గాలించారు.
ఇదీ చదవండి:పంట కాపాడుకోవాడానికి రైతు తాపత్రయం