కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కరీంనగర్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బస్టాండ్ ముందు బస్సులను ఆపడానికి ప్రయత్నించిన వామపక్ష పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలని సీపీఐ జిల్లా నాయకులు కుమార్ డిమాండ్ చేశారు. అరెస్టులు చేసినంత మాత్రాన ఉద్యమాలు ఆగవని అన్నారు. ఆ చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాటాలు కొనసాగిస్తామని వామపక్ష పక్ష నాయకులు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు - Karimnagar bharat bandh news
భారత్ బంద్కు మద్దతుగా కరీంనగర్లో పలు పార్టీల నాయకులు ఆందోళన నిర్వహించారు. బస్టాండ్ ముందు బస్సులను ఆపడానికి ప్రయత్నించిన వామపక్ష పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
కేంద్రం కొత్తగా తెచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ కరీంనగర్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో కరీంనగర్ బస్టాండ్ ముందు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు అరెస్టు చేయడం ఘోరమైన చర్య అని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి విమర్శించారు. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయని ఎడల ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి :రోడ్డెక్కిన రైతులు... రహదారుల దిగ్బంధం