తెరాస నియంతృత్వాన్ని తాము భరతం పడతామంటే ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరిస్తున్నాడని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. సీఎం తాటాకు చప్పుళ్లకు భయపడే కార్యకర్త తాను కాదని కరీంనగర్ భాజపా బహిరంగ సభలో లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రం దాటితే కేసీఆర్ చెల్లని రూపాయని విమర్శించారు. అమిత్ షా గైర్హాజరుతో లక్ష్మణ్ నాయకత్వంలో సభ జరిగింది. తెలంగాణను బారు.. బీరుగా మార్చిన ఫామ్ హౌజ్ పాలన కావాలా.. అని ప్రజలను ప్రశ్నించారు. గులాబీ ప్రభుత్వం గద్దె దించేదాకా పోరాడతామని లక్షణ్ పేర్కొన్నారు.
'తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదు' - MODI
రాష్ట్రాన్ని బారు, బీరుగా మార్చిన కారు ప్రభుత్వం కావాలా.. అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీపడే నాయకత్వ ప్రభుత్వం కావాలా.. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్లం కాదు: లక్ష్మణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
కరీంనగర్ భాజపా బహిరంగ సభలో లక్ష్మణ్