జీవిత లక్ష్యాన్ని సాధించింది, జీవితాన్ని కోల్పోయింది. పోలీసు దేహ దారుఢ్య పరీక్షల్లో పరిగెత్తి కుప్పకూలింది.
పరుగు పందెంలో గుండాగి యువతి మృతి
By
Published : Feb 18, 2019, 10:12 AM IST
|
Updated : Feb 18, 2019, 11:32 AM IST
పరుగు పందెంలో గుండాగి యువతి మృతి
పోలీస్ దేహదారుఢ్య పరీక్షల్లో గుండెపోటుతో ఓ యువతి మృతి చెందింది. కరీంనగర్ జిల్లా వెలిచాలకు చెందిన కొండ మమత పోలీసు ఉద్యోగ కోసం శిక్షణ పొందుతోంది. పరీక్షల్లో భాగంగా 100మీటర్ల పరుగులో అర్హత సాధించి హఠాత్తుగా కుప్పకూలింది. పోలీసులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆరోగ్య సమస్యలు ఉంటే ముందు సమాచారమిస్తే మరో రోజు నిర్వహిస్తామని సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. ప్రాక్టీస్ లేకుండా హాజరు కావద్దని అభ్యర్థులకు సూచించారు.