కరీంనగర్లో నిర్వహించిన ఆక్వాబీన్ లేజర్ షో.. నగరవాసులను కనువిందు చేసింది. మానేరు జలాశయం వద్ద నిర్వహించిన లేజర్ షో చూపరులను కట్టిపడేసింది. లేజర్ షో విన్యాసాలను తిలకించేందుకు మానేరు ప్రాంతానికి నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుమారు గంట పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆక్వా బీన్ లైవ్ షో కాంతి కిరణాలను వెదజల్లింది. ఆనకట్ట పైనుంచి జనాలు ఉత్సాహంగా తిలకించారు. అరగంట పాటు పలు దఫాలుగా లేజర్ ప్రదర్శన జరిగింది. రంగురంగుల కాంతుల వెలుగులు చూసి నగరవాసులు కేరింతలు కొట్టారు. పదినిమిషాల పాటు నింగిలో తారాజువ్వల ప్రదర్శన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లేజర్ షోలో తిలకించేందుకు 20 వేల మంది వచ్చినట్లు నిర్వాహకులు అంచనా వేశారు.
కరీంనగర్ కళకళ.. మానేరు డ్యాంలో అదరగొట్టిన లేజర్ షో - Karimnagar District Latest News
కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యామ్‌లో లేజర్ షో ప్రదర్శన ఆకట్టుకుంది. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు నిర్వహించిన లేజర్ ప్రదర్శన కనువిందు చేసింది.
కరీంనగర్ కళకళ.. మానేరు డ్యాంలో అదిరగొట్టిన లేజర్ షో
మొదటిసారి కరీంనగర్ కేంద్రంగా లేజర్ షో ప్రదర్శన ఉండడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి పలువురు నాయకులు ప్రజల మధ్యలో ఉండి కార్యక్రమాన్ని వీక్షించారు.
ఇదీ చదవండి:భారీ వర్షం కురిసినా.. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా..