లాక్‌డౌన్ మినహాయింపులో భాగంగా రిజిస్ట్రేషన్లకు అనుమతించడంతో రియల్ ఎస్టేట్ రంగం ఊపిరి పీల్చుకుంది. దాదాపు 20రోజుల పాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోగా తాజాగా స్లాట్ బుకింగ్ ప్రారంభమయ్యింది. కరీంనగర్‌లో ఎప్పుడెప్పుడు రిజిస్ట్రేషన్లు మొదలు పెడతారా అని ఎదురుచూస్తున్న వారు ..స్లాట్ బుకింగ్‌తో తమ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు.
Registrations : కరీంనగర్‌లో రిజిస్ట్రేషన్లు పునఃప్రారంభం - karimnagar district news
రిజిస్ట్రేషన్లకు లాక్‌డౌన్ మినహాయింపు ఇవ్వడంతో రియల్ ఎస్టేట్ రంగం ఊపిరి పీల్చుకుంది. 20 రోజుల పాటు నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు తాజాగా ప్రారంభమయ్యాయి. కరీంనగర్‌లో ఎప్పుడెప్పుడు రిజిస్ట్రేషన్లు మొదలు పెడతారా అని ఎదురుచూస్తున్న వారు స్లాట్ బుకింగ్‌తో తమ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు.
కరీంనగర్‌లో రిజిస్ట్రేషన్లు, రిజిస్ట్రేషన్లు పునఃప్రారంభం
ఉదయం 9 గంటల నుంచి ఒంటి గంట వరకే కార్యాలయ పని వేళలు కావడం వల్ల రోజు కేవలం 48 మందికే స్లాట్ బుకింగ్‌కు అనుమతిస్తున్నారు. స్లాట్ బుక్ చేసుకుంటే అనుకున్న సమయానికి 5 నిమిషాల ముందు వస్తే చాలని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ డాక్టర్ కిరణ్ తేజావత్ తెలిపారు. రిజిస్ట్రేషన్‌కు వచ్చేవారు విధిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.