లాక్‌డౌన్ గడువు మరింత పెంచిన నేపథ్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడానికి మానవతావాదులు ముందుకు వస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లక్ష్మిదేవిపల్లి సర్పంచ్ పద్మజ తన గ్రామపంచాయతీలోనే కాకుండా నగరంలోని ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ప్రజలకు ఎంతో సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో పాటు, వలస కార్మికులు.. ఆహారం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సరుకులు పంపిణీ చేశారు. మానవతావాదులు ముందుకొచ్చి అవసరార్ధులను ఆదుకోవాలని పద్మజ విజ్ఞప్తి చేశారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన సర్పంచ్ - కరీంనగర్ జిల్లా వార్తలు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ పద్మజ గ్రామంలోని పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రజలకు ఎంతో సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో పాటు, వలస కార్మికులు ఆహారం కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కావాల్సిన వస్తువులు ఇచ్చామన్నారు.
groceries to poor people