కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల రహదారి ప్రమాదంలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఉప్పరమల్యాలకు చెందిన నిట్టు కనకవ్వ, భర్త కొమురయ్య, తన అక్క కూతురు శిరీషాలు గంగాధరలోని వారం సంతకు బైక్పై బయలు దేరారు.
బైకును ఢీకొట్టిన లారీ... మహిళ మృతి - lady died in raod accident at kurikala highway
వారం సంతకు బయలు దేరిన ఓ కుటుంబాన్ని ప్రమాదం వెంబడించింది. బైక్పై వెళ్తున్న వారిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య స్పాట్లో ప్రాణాలు కోల్పోయింది. భర్త, మేనకోడలకు తీవ్రగాయాలయ్యాయి.
బైకును ఢీకొట్టిన లారీ... మహిళ మృతి
కరీంనగర్ - జగిత్యాల రహదారిపై ప్రయాణిస్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ వారి వాహనాన్ని ఢీకొట్టింది. కనక్కవ్వ కిందకి పడిపోంది. లారీ డ్రైవర్ ఆగకుండా ఆమెపై నుంచి వేగంగా దూసుకెళ్లడంతో ఆమె శరీరం నుజ్జు నుజ్జు అయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొమురయ్య,శిరీషాలను ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి:చెరువులోకి దూసుకెళ్లిన కారు..సర్పంచ్ భర్త, కుమారుడు, డ్రైవర్ మృతి