కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలో ఆరో విడత హరితహారం నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్లు హాజరై మొక్కలు నాటారు.
'మొక్కలు నాటారు సరే.. సంరక్షణ చర్యలేంటి?' - మంత్రి కేటీఆర్ వార్తలు
హరితహారం కార్యక్రమానికై... 175 ఎకరాల్లో పెంచిన హరితవనాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. వెదురుగట్ట గ్రామంలో హరితహారం కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మొక్కలు నాటి పలు అంశాలపై అధికారులతో చర్చించారు.
!['మొక్కలు నాటారు సరే.. సంరక్షణ చర్యలేంటి?' ktr-plantation-at-vedurugatta-in-krimnagar-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7939505-thumbnail-3x2-ktr.jpg)
'మొక్కలు నాటారు సరే.. సంరక్షణ చర్యలేంటి?'
అనంతరం గుట్టపైన ఉన్న ఎర్రనేలలో... 175 ఎకరాల్లో పెంచిన హరితవనాన్ని కేటీఆర్పరిశీలించారు. ఇప్పటి వరకు నాటిన మొక్కలు... వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అడవుల శాతంపై జిల్లాల వారీగా వివరాలను అధికారులు వివరించారు. 'పల్లె ప్రకృతి వనాలు' కార్యక్రమం గురించి జిల్లా కలెక్టర్ కేటీఆర్కు వివరించారు.
'మొక్కలు నాటారు సరే.. సంరక్షణ చర్యలేంటి?'