గ్రామగ్రామాన కేటీఆర్ జన్మదిన వేడుకలు - గ్రామగ్రామాన కేటీఆర్ జన్మదిన వేడుకలు
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లాలోని గ్రామగ్రామాన ఘనంగా నిర్వహిస్తున్నారు.

గ్రామగ్రామాన కేటీఆర్ జన్మదిన వేడుకలు
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో గ్రామగ్రామాన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామడుగు మండలం వెలిచాలలోని అనాధాశ్రమంలో తెరాస నాయకులు కేక్ కట్ చేశారు. పండ్లు, భోజనం అందించి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం వెలిచాల ప్రభుత్వ భూముల్లో వేయి మొక్కలు నాటారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో బూరుగుపల్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రామడుగు ఎంపీపీ కలిగేటి కవిత దంపతులు రక్తదానం చేశారు.
గ్రామగ్రామాన కేటీఆర్ జన్మదిన వేడుకలు