KTR Attended BRS Activists Meeting at Bikkanur : ఈ ఎన్నికల్లో దిల్లీ దొరలకు.. గల్లీ ప్రజలకు మధ్య పోరాటం జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. తెలంగాణ పౌరుషానికి ప్రతీకైన కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కామారెడ్డి ప్రజలను కోరారు. జిల్లాలోని బిక్కనూర్‌లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్.. అనంతరం నేతలకు దిశానిర్దేశం చేశారు.
రైతులను బిచ్చగాళ్లని అవమానించిన కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు చేయాలని మంత్రి కేటీఆర్.. కామారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.రేవంత్ రెడ్డి మూడు గంటలు విద్యుత్ సరఫరా చాలంటారని.. ఉత్తమ్‌కుమార్ రెడ్డి రైతు బంధు దుబారా అంటారన్నారు. ఈ 24 గంటల విద్యుత్ సరఫరా, రైతు బంధు వద్దనే వాళ్లు తమకు కావాలా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ మట్టిబిడ్డ కేసీఆర్ ఉండగా.. రాహుల్, డీకే శివకుమార్ తమకెందుకంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హనుమంతుడి గుడిలేని ఊరు లేదు.. కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని తెలిపారు.
Minister KTR Participate in BRS Booth Level Meeting : 'ఈ 30 రోజులు సెల్ఫీ కొట్టు.. ఓటు పట్టుతో సోషల్ మీడియాలో దుమ్ము లేవాలి'
KTR on BRS Manifesto : కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ కేసీఆర్ బీమా(KCR Bhima).. ప్రతి ఇంటికీ ధీమా పథకం అందిస్తామని మాటిచ్చారు. అన్నపూర్ణ పథకం ద్వారా అందరికీ సన్నబియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు. కామారెడ్డిని అభివృద్ధి చేసేందుకే కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని తెలిపారు. అందుకే నవంబరు 9న కేసీఆర్ నామినేషన్ వేస్తారని.. ఆరోజు అందరూ రావాలని పిలుపునిచ్చారు.
KTR Fires on Congress :రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు కామారెడ్డి నియోజకవర్గం గురించే చర్చ జరుగుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ఎందుకు అక్కడి నుంచే పోటీ చేస్తున్నారని జోరుగా చర్చలు సాగుతున్నాయని చెప్పారు. కామారెడ్డి రైతుల కల నెరవేర్చడానికే కేసీఆర్ పోటీ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీ ఇచ్చే చాక్లెట్లకు ఆశ పడొద్దు.. బీఆర్ఎస్ ఇచ్చే బిర్యానీ తినండి అంటూ చమత్కరించారు. ఇతర పార్టీలు డబ్బులిస్తే తీసుకొండి.. కానీ ఓటు మాత్రం గులాబీ పార్టీకే వేయాలని సూచించారు. తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. సోనియాని బలిదేవత, రాహుల్‌ను ముద్ద పప్పు అని రేవంత్ రెడ్డి అన్నారని.. నాటి మాటలను గుర్తు చేశారు. రాహుల్ చెప్పినట్లు ఇది దిల్లీ దొరలకు, గల్లీ ప్రజలకు మధ్య పోరాటం అని అన్నారు.
BRS campaign in Telangana 2023 : ప్రచారంలో కారు జోరు.. కేసీఆర్ భరోసాతో ప్రజల్లోకి బీఆర్ఎస్ నేతలు.. పలుచోట్ల నిరసన గళమెత్తుతున్న ప్రజలు
KTR Comments on Revanth Reddy : "కొడంగల్‌లో నరేందర్రెడ్డిపై గెలవని రేవంత్‌రెడ్డి... కేసీఆర్‌పై గెలుస్తారా..?"