కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కొండాయపల్లిలో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వెళ్లిన రైతు... కుక్కలు మొరగటంతో వీధిలోకి వచ్చాడు. అదే సమయంలో వీధిలో ఎలుగుబంటి సంచరించటంతో భయబ్రాంతులకు గురై... సెల్ఫోన్లో చిత్రించాడు.
అర్ధరాత్రి సంచరిస్తున్న ఎలుగుబంటి... భయాందోళనలో స్థానికులు - ఎలుగుబంటి సంచారం
వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన రైతు... కుక్కలు మొరుగుతున్నాయని వీధిలోకి చూశాడు. అదే సమయంలో సంచరిస్తున్న ఎలుగుబంటిని చూసి భయబ్రాంతులకు గురయ్యాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని కొండాయపల్లిలో చోటు చేసుకుంది.
అర్ధరాత్రి సంచరిస్తున్న ఎలుగుబంటి... భయాందోళనలో స్థానికులు
ఎండలు తీవ్రం కావడంతో నీటి వనరులు లేక ఎలుగు గ్రామంలోకి ప్రవేశించినట్లు స్థానికులు భావిస్తున్నారు. రాత్రి వేళ ఎలుగుబంటి సంచరించి... భయంతోనో, ఆకలితోనే దాడి చేసే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు పరిష్కారం చూపాలని కోరారు.
ఇదీ చూడండి:'ఎవర్ గివెన్'కు ఎందుకు అలా జరిగింది?