తెలంగాణ

telangana

ETV Bharat / state

కేజీ టు పీజీ విద్య ఒకే దగ్గర.. వీడియో షేర్ చేసిన కేటీఆర్ - KG to PG education in one premises in Gambhiraopet

KG to PG education: ఒకే ప్రాంగణంలో కేజీ టు పీజీ విద్యను అందిస్తామన్న సీఎం కేసీఆర్​ కల సాకరం కాబోతుందని మంత్రి కేటీఆర్​ హర్షం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేటలో ఈ మేరకు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న భవనాల సముదాయం, ప్లే గ్రౌండ్​ ఫోటోలను ట్విటర్​ వేదికగా మంత్రి పంచుకున్నారు.

KG to PG education
KG to PG education

By

Published : Dec 24, 2022, 12:24 PM IST

KG to PG education: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఒకే ప్రాంగణంలో కేజీ టు పీజీ విద్యకు రంగం సిద్ధమైంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ నిర్మాణాలు పూర్తి కావడంతో వాటి ఫొటోలు, వీడియోలను మంత్రి కేటీఆర్ ట్విటర్​ వేదికగా పంచుకున్నారు. విశాలమైన భవనాలు, పచ్చని ప్లే గ్రౌండ్ దృశ్యాలు.. అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కేజీ టు పీజీ విద్యను అందిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారం కాబోతుందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో నియోజకవర్గంలోని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details