కరీంనగర్లో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం - కరీంనగర్లో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
యాదాద్రి దేవాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని, తెరాస పార్టీ గుర్తును తొలగించాలని నిరసనకు దిగిన కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని కరీంనగర్లో భజరంగ్‌దళ్ కార్యకర్తలు తప్పుబట్టారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ శిలలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని, తెరాస పార్టీ గుర్తు, ప్రభుత్వ పథకాలను తొలగించాలని రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు దిగిన కార్యకర్తలను అరెస్టు చేసినందుకు కరీంనగర్లో భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తెలంగాణ చౌక్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
TAGGED:
hh