MLC Kavita Wishes to Singareni : బొగ్గు గనులను ప్రైవేట్‌పరం చేసి సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి కార్మికుల పక్షాన పోరాడతామని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రత్యేక చొరవతో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, లాభాలు, కార్మికుల సంక్షేమంలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. సింగరేణి 103 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కార్మికులకు, యాజమాన్యానికి కవిత శుభాకాంక్షలు తెలిపారు.
సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటాం: ఎమ్మెల్సీ కవిత
MLC Kavita Wishes to Singareni : సింగరేణి 103 వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కార్మికులకు, యాజమాన్యానికి ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. బొగ్గు ఉత్పత్తిలో రారాజుగా, తెలంగాణ సిరులవేణిగా.. 102 ఏళ్లు అవిశ్రాంతంగా సింగరేణి దేశానికి వెలుగులు పంచుతోందని కొనియాడారు. బొగ్గు గనులను ప్రైవేట్‌పరం చేసి సంస్థను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని కవిత మండిపడ్డారు.
Kalvakuntla Kavitha
సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలో రారాజుగా, తెలంగాణ సిరులవేణిగా.. 102 ఏళ్లుగా అవిశ్రాంతంగా దేశానికి వెలుగులు పంచుతోందని కవిత ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి: