కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి కరీంనగర్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద ప్రజలకు కావేరి కాటన్ అధినేత రమేష్ నిత్యావసర సరుకులను అందజేశారు. 1500 విలువ చేసే 23 రకాల వస్తువులను 30 మంది పేద కుటుంబాలకు పంపిణీ చేశారు.
నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందజేత - daily commodities distribution in karimnagar
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లోని నిరుపేదలకు కావేరి కాటన్ అధినేత 1500 రూపాయల విలువ చేసే 23 రకాల నిత్యావసర సరుకులను అందజేశారు. కరోనా మహమ్మారిని తరిమేసేందుకు ప్రజలందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని సూచించారు.
నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందజేత
గత 79 రోజులుగా అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఫౌండర్, కావేరి కాటన్ అధినేత రమేష్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారి దేశాన్ని వదిలి వెళ్లిపోయేవరకూ ప్రజలందరూ మాస్కులు ధరిస్తూ... భౌతిక దూరం పాటించాలని సూచించారు.