Dharmarajpalli Foundation seed society :కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలో పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన గ్రామం ధర్మరాజుపల్లి. రైతులు వ్యవసాయ అవసరాల కోసం నిత్యం హుజూరాబాద్, ముల్కనూరు, బాపట్ల తదితర ప్రాంతాలకు వెళ్లేవారు. అయితే సీజన్ ముంగిట్లోకి రావడంతో విత్తనాల కోసం గ్రామరైతులు పడే తాపత్రయాన్ని గమనించిన ముల్కనూరు సహకార బ్యాంకు.. పలు సూచనలు చేసింది. ఎక్కడి నుంచో విత్తనాలు కొనుక్కునే అవసరం లేకుండా.. స్వయంగావిత్తనోత్పత్తి చేసుకునేలా సూచనలు చేశారు.
KarimnagarFoundation seed society :ఇలా.. గ్రామంలో సంఘం ఏర్పాటుకు రైతులు ముందుకు వచ్చారు. 1999లో 70 మందితో ‘ధర్మరాజుపల్లి ధాన్య విత్తన రైతు పరస్పర సహాయ సహకార పరిమిత సంఘం’ అనే పేరుతో ప్రారంభించారు. ఇప్పుడు ఆ సంఘంలో సభ్యుల సంఖ్య 230 మందికి చేరింది. అధ్యక్షులు, జనరల్ మేనేజర్, పది మంది డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతినెల మొదటి వారంలో పాలకవర్గ సభ్యులు సమావేశమవుతారు. సంఘంలో జరిగే ప్రతి వ్యవహారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఏటా జూన్‌లో మహాసభను నిర్వహిస్తున్నారు. వరి పరిశోధన స్థానాల నుంచి నూతన వరి వంగడాలను తీసుకువస్తున్నారు. రాజేంద్రనగర్, కూనారం, జగిత్యాల, బాపట్ల తదితర ప్రాంతాల నుంచి సన్న, దొడ్డు రకాలకు సంబంధించిన ఫౌండేషన్ విత్తనాలను తీసుకొచ్చి విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని ప్రాసెసింగ్ చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుండటంతో సహకార సంఘానికి మంచి పేరు వచ్చింది.
"1990లో ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాం. పండించిన ధాన్యాన్ని విక్రయించాలన్నా, విత్తనాలు కొనాలన్నా కనీసం 30కిలో మీటర్లు వెళ్లాల్సిందే. మా విత్తనాల నాణ్యత బాగుందని మీరు ఇక్కడికి వచ్చి విక్రయించే బదులు మీ దగ్గరే విక్రయించుకోవచ్చు అని చెప్పిన అధికారుల సూచనల మేరకు మేమే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం." - రమణా రెడ్డి, జనరల్ మేనేజర్, సహకార సంఘం, ధర్మరాజుపల్లి