తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళల సమస్యకు పాఠశాల విద్యార్థుల పరిష్కారం - సింథటిక్ న్యాప్​కిన్స్ వలన అనేక ఇబ్బందులు

Students Prepared Eco Friendly Napkins: మహిళా లోకం ఎదుర్కొంటున్న సమస్యను పెద్ద మనస్సుతో ఆలోచించి, చిట్టి చేతులతో పరిష్కరించేందుకు ముందుకొచ్చారు. సానిటరీ న్యాప్‌కిన్స్‌ పర్యావరణ హితంగా రూపొందించాలని భావించి సఫలమయ్యారు. సింథటిక్‌ న్యాప్‌కిన్స్‌తో ఎదురయ్యే ఆరోగ్య సమస్యను అధిగమించేందుకు ఎకోఫ్రెండ్లీగా రూపొందించి, జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. అవార్డు సైతం అందుకున్నారు. తమ ఉత్పత్తికి పెటెంట్‌ హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారు.

Students Prepared Eco Friendly Napkins
Students Prepared Eco Friendly Napkins

By

Published : Feb 5, 2023, 3:27 PM IST

పర్యావరణహితం ఆరోగ్యకరం

Students Prepared Eco Friendly Napkins: కరీంనగర్ పారమిత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలకు గొప్ప ఆలోచన వచ్చింది. మహిళలు రుతుస్రావ సమయంలో వినియోగిస్తున్న సింథటిక్‌ సానిటరీ న్యాప్‌కిన్స్‌ వల్ల అనేక రోగాల బారిన పడుతున్నారని తెలుసుకున్న శ్రీహరిణి, శివకీర్తి ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నించారు.

Solution To Women Problems: సానిటరీ న్యాప్‌కిన్స్ తయారీకి ఎలాంటి ముడి పదార్ధాలు వాడతారు..? దాని వల్ల ఆరోగ్యానికి పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయో అధ్యయనం చేశారు. ప్రస్తుతం వినియోగిస్తున్న పదార్ధాలు కాకుండా అరటి, వెదురు నారతో న్యాప్‌కిన్స్‌ రూపొందించే పనిలో పడ్డారు. బాలికల ఆలోచనకు ఉపాధ్యాయులు సహకరించి అవసరమైన ముడిపదార్ధాలను సమకూర్చారు.

శరీరానికి ఎలాంటి హాని కలగకుండా అతితక్కువ ఖర్చుతో రూపొందించారు. అవార్డులు అందుకోవడంతో పాటు జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యారు. విద్యార్దినులు తయారు చేసిన ఎకోఫ్రెండ్లీ న్యాప్‌కిన్లకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. వీటి వినియోగం పర్యావరణ హితమే కాకుండా మహిళల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

చిట్టి చేతుల్లో ప్రాణం పోసుకున్న ఈ ఉత్పత్తి కుటీర పరిశ్రమగా పలువురికి ఉపాధిని కల్పిస్తుందని భరోసాగా చెబుతున్నారు. పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేశామని, అనుమతి రాగానే చౌకధరలో అందించే ప్రయత్నం చేస్తామంటున్నారు. విద్యార్థుల సృజనాత్మకతను ప్రభుత్వం ప్రోత్సహిస్తే, మరిన్ని ప్రయోగాలు చేసి సమాజంలో సమస్యల పరిష్కారానికి దోహదపడతారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details