తెలంగాణ

telangana

ETV Bharat / state

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం: స్థంభించిన జనజీవనం - gg

కరీంనగర్​ జిల్లా వ్వాప్తంగా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్థంభించింది. పలు కాలనీలు, రహదారులు జల సంద్రమయ్యాయి.

కరీంనగర్లో భారీ వర్షం

By

Published : Sep 25, 2019, 3:00 PM IST

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. కరీంనగర్​ పట్టణంలో మురుగు కాలువల వ్యవస్థ సరిగా లేక పలు ప్రాంతాల్లో రహదారిపై వర్షపు నీటితో పాటు ప్రవహించింది. జ్యోతినగర్, మంకమ్మ తోట ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరీంనగర్​తో పాటు రాజన్న సిరిసిల్లలో భారీ వర్షాలు కురిసాయి. రహదారులు జలమయమై వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బోయిన్​పల్లి మండలం నీలోజిపల్లెలో లక్ష్మణ్ అనే రైతు పిడుగు పడి మరణించాడు.

కరీంనగర్లో భారీ వర్షం

ABOUT THE AUTHOR

...view details