తెలంగాణ

telangana

ETV Bharat / state

వీఆర్ఏ భార్యపై లైంగిక వేధింపులు.. వీఆర్వో పై కేసు నమోదు - కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్

తోటి ఉద్యోగి భార్యను లైంగిక వేధించిన వీర్వో పై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తన భర్తకు పని అప్పగించే సాకుతో.. ప్రతిసారి ఇంటికి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వీఆర్ఏ భార్య కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

Karimnagar police have registered a case against Werewo who sexually abused a fellow employee's wife
వీఆర్ఏ భార్యపై లైంగిక వేధింపులు.. వీఆర్వో పై కేసు నమోదు

By

Published : May 31, 2020, 10:56 PM IST

తోటి ఉద్యోగి భార్యపై మరో ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. గోపాల్ పూర్, దుర్శేడ్, వల్లంపహాడ్, ఇరుకుల్ల గ్రామాల బాధ్యతలు చూసే రాజమల్లు అనే వీఆర్వో.. గోపాల్ పూర్ బాధ్యతలు చూస్తున్న వీఆర్ఏ లింగయ్య భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

తన భర్తకు పని అప్పగించే సాకుతో.. ప్రతిసారి ఇంటికి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వీఆర్ఏ భార్య కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం వీఆర్వో రాజమల్లు పరారీలో ఉన్నాడని.. అధికారులు ఫిర్యాదు వాపసు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు బాధితులు వెల్లడించారు. బాధితుల పక్షాన నిలవాల్సిన ఉన్నతాధికారులు.. నిందితులకు వత్తాసు పలకడంపై విమర్శలు వస్తున్నాయి.

ఇదీ చూడండి:మంత్రి జగదీశ్​రెడ్డి వర్సెస్ ఉత్తమ్​కుమార్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details