కరీంనగర్లో మహిళలు, విద్యార్థినులను వేధించే పోకిరీలపై రౌడీషీట్లు తెరవడంమే కాదు నిర్భయ కేసులను నమోదు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి అన్నారు. మహిళలను వేధిస్తున్న 23 మంది పోకిరీలకు కమిషనరేట్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. పోకిరిలు తమ ప్రవర్తన మార్చుకోవాలని కఠిన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విద్యాసంస్థలు ఉన్న ప్రాంతాల్లో షీ టీంలు నిఘా కొనసాగిస్తున్నాయన్నారు. ఎవరికైనా సమస్య వస్తే వాట్సాప్ నెంబర్ 9440795182 కు సమాచారం ఇవ్వాలని కమిషనర్ చెప్పారు.
కరీంనగర్లో 'పోకిరీ'లకు కౌన్సిలింగ్
కరీంనగర్లో పోకిరిలపై పోలీసులు నజర్ వేశారు. మహిళలు, విద్యార్థినులను వేధిస్తే రౌడీషీట్తోపాటు నిర్భయ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
కరీంనగర్లో 'పోకిరీ'లకు కౌన్సిలింగ్