సమయం అర్ధరాత్రి 12 గంటలు.. పోలీస్ కమిషనర్‌కు ఫోన్.. సార్ పిల్లి బావిలో పడింది.. రక్షించండని వేడుకోలు.. వేగంగా స్పందించిన పోలీస్ బాస్ అధికారులను అప్రమత్తం చేశారు. మార్జాలాన్ని రక్షించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది.
బావిలో పడ్డ పిల్లి.. రంగంలోకి సీపీ.. అర్ధరాత్రి పోలీసుల రెస్కూ ఆపరేషన్! - కరీంనగర్లో అర్ధరాత్రి పిల్లికోసం పోలీసుల రెస్క్కూ ఆపరేషన్
'సార్ మా ఇంటిలో ఉన్న బావిలో పిల్లి పడిపోయింది. దానిని కాపాడడానికి సహాయం చేయండి' అంటూ ఓ వ్యక్తి సీపీకి ఫోన్ చేశాడు. దీనితో.. స్పందించిన సీపీ.. పోలీసు అధికారులను ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు... ఆ పిల్లిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది.
స్థానిక విద్యానగర్‌లోని కేడీసీసీ బ్యాంక్ వద్ద నివాసం ఉంటున్న మనోహర్ ఇంటి వెనకాల ఎవరూ వినియోగించని చేదబావి ఉంది. ఇంటి పరిసరాల్లో సంచరించే రెండు పిల్లులు ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో పోట్లాడుకున్నాయి. ఒక పిల్లి బావిలో పడిపోయింది. అక్కడే ఉన్న మనోహర్ కుమార్తె స్నితిక (10వ తరగతి) గమనించి తన తండ్రికి చెప్పింది. వారిద్దరూ గూగుల్‌లో జంతు సంరక్షణ సిబ్బందిని ఆశ్రయించారు. వారి సూచనల ప్రకారం థర్మాకోల్ షీట్‌ను బావిలో వేసి పిల్లిని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. జంతువుల సంరక్షణ సిబ్బంది సూచనతో అర్ధరాత్రి మనోహర్ కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. స్పందించిన సీపీ ఏసీపీ తుల శ్రీనివాస్‌రావును పురమాయించారు. అర్ధరాత్రి 12.30 గంటలకు జాలి గంపను బావిలోకి పంపి పిల్లిని సురక్షితంగా బయటకు తీశారు.
ఇవీ చదవండి: