కరోనా వ్యాప్తి నిర్మూలన కోసం కరీంనగర్ పోలీసుశాఖ పటిష్ఠ చర్యలు చేపడుతోంది. అత్యవసర పనుల కోసం ప్రభుత్వం కేటాయించిన సమయాన్ని దుర్వినియోగం చేస్తున్న వారికి కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది.
బైక్పై ఇద్దరు ప్రయాణిస్తే ఫైన్ కట్టాల్సిందే..! - CORONA UPDATES IN KARIMNAGAR
లాక్డౌన్ దృష్ట్యా ప్రజలు అవసరాలు తీర్చుకునేందుకు ప్రభుత్వం కేటాయించిన సమయాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. కరీంనగర్లో ద్విచక్రవాహనాలపై బలాదూర్ తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
బైక్పై ఇద్దరు ప్రయాణిస్తే ఫైన్ కట్టాల్సిందే..!
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కూడళ్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ద్విచక్రవాహనాలపై ఇద్దరు ప్రయాణిస్తున్నవారిని పట్టుకుంటున్నారు. అకారమంతో రోడ్డుపైకి వచ్చిన వారికి జరిమానాలు వేస్తున్నారు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని... లేని యెడల కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.