తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా నిబంధనలు బేఖాతరు.. నగరంలో యువకుల హోలీ వేడుకలు - తెలంగాణ వార్తలు

కొవిడ్ నిబంధనలు గాలికొదిలేసి కరీంనగర్‌లో హోలీ వేడుకల్లో రాజస్థానీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీనిపై నగర పోలీసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనలు బేఖాతరు చేసిన యువకుల ఫొటోలను పోలీసులు తమ సెల్‌ఫోన్లలో బంధించారు.

karimnagar holi, holi celebrations 2021
కరీంనగర్‌లో హోలీ వేడుకలు, హోలీ వేడుకలు 2021

By

Published : Mar 29, 2021, 5:26 PM IST

కరోనా రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో హోలీ పండుగను నిరాడంబరంగా జరుపుకోవాలని ప్రభుత్వం సూచించినా... ఆ నిబంధనలు గాలికొదిలేశారు కొందరు యువకులు. కరీంనగర్‌ నగరంలో రాజస్థానీ యువకులు టవర్ సర్కిల్ పెద్ద ఎత్తున హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. కనీసం మాస్క్ ధరించకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు.

దీనిపై పోలీసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా నిబంధనలు పాటించకుండా వేడుకల్లో పాల్గొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంక్షలను బేఖాతరు చేసిన యువకులను పోలీసులు సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. వారిపై యాక్షన్ తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

ఇదీ చదవండి:పోషకాహార కార్కానా.. ఈ 'న్యూట్రీ గార్డెన్'​

ABOUT THE AUTHOR

...view details