కరీంనగర్లో ఒక్కసారిగా బలమైన గాలులతో కూడిన వర్షం కురిసింది. అరగంట పాటు కురిసిన వర్షం జనాన్ని భయపెట్టింది. జ్యోతి నగర్లోని ఓ ఇంటి నిర్మాణానికి అడ్డుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గాలులకు చిరిగిపోయి విద్యుత్ తీగలపై పడ్డాయి. ఫ్లెక్సీల కారణంగా విద్యుత్తు తీగలు కూడా తెగిపోవడం వల్ల కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు.
అకాల వర్షానికి ఆగమైన కరీంనగర్ వాసులు - గాలులతో కూడిన వర్షానికి కరీంనగర్లో తెగిపడిన కరెంట్ తీగలు
కరీంనగర్ జిల్లా కేంద్రంలో కురిసిన అకాల వర్షానికి విద్యుత్తు తీగలు, ఫ్లెక్సీలు తెగిపోయాయి. వర్షపు నీరంతా రోడ్ల పైకి చేరడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.
అకాల వర్షానికి ఆగమైన పట్టణవాసులు
సూర్య నగర్లో, కోర్టు నుంచి ఆదర్శనగర్ వెళ్లే రహదారిలో మురుగు కాలువ నిండా చెత్త చేరి వర్షపు నీరు రహదారులపై ప్రవహించింది. రోడ్డుపై నడిచే పరిస్థితి లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవలసి వచ్చింది. జిల్లాలోని గంగాధర, రామడుగు మండలాల్లో గాలులకు, వర్షానికి మొక్కజొన్న నేల వాలింది.
ఇదీ చూడండి :తెలంగాణ పద్దు... కేటాయింపులు ఎవరెవరికి ఎలా అంటే?
Last Updated : Mar 8, 2020, 7:40 PM IST
TAGGED:
HEAVY RAIN IN KARIMNAGAR