కరీంనగర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన శశాంక.. అధికారులతో సమావేశమై ప్రభుత్వ పథకాల అమలు గురించి తెలుసుకున్నారు.
'పథకాల అమల్లో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో ఉండాలి' - కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాల అమల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలపడానికి అధికారులు కృషి చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. నూతనంగా కరీంనగర్ జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు స్వీకరించారు.
కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక సమీక్ష
జిల్లాలో వరిధాన్యం సేకరణ, పత్తి కొనుగోళ్లు, రంజాన్ పండుగ దుస్తుల పంపిణీ, వన్స్టాఫ్ సెంటర్ పనితీరుపై కలెక్టర్ శశాంక ఆరా తీశారు. అధికారులు ప్రభుత్వ పథకాల అమలుకు కృషి చేయాలని సూచించారు.
అన్ని శాఖల అధికారులు.. తమ పరిధిలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాల సమగ్ర నివేదికలు తయారు చేసి సిద్ధంగా ఉండాలని శశాంక ఆదేశించారు.
- ఇదీ చూడండి : ఆహార భద్రత అధికారుల ఆకస్మిక తనిఖీలు