నగరపాలక సంస్థ అనుమతి లేకుండా గొర్రె, మేకలను వధిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మేయర్ సునీల్‌రావు హెచ్చరించారు. కరీంనగర్ పట్టణంలోని వాల్మీకి నగర్లో ఉన్న మేకల వధశాలను ఆయన పరిశీలించారు. అక్కడ ఉన్న ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణ తాత్కాలిక సాయం కింద రూ. 15 లక్షలు మంజూరు చేసి వధశాలలో మెరుగైన వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గొర్రె, మేకల వధశాలను పరిశీలించిన మేయర్ - కరీంనగర్లో మేకల వధశాలను పరిశీలించిన మేయర్ సునీల్‌రావు
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు నాణ్యమైన మాంసము అందించాలని నగరపాలక శాఖ అధికారులకు మేయర్ సునీల్ రావు ఆదేశించారు. నగరంలోని వాల్మీకి నగర్లో ఉన్న గొర్రె, మేకల వధశాలను కమిషనర్ క్రాంతితో కలిసి ఆయన సందర్శించారు.
కరీంనగర్ వార్తలు
నగర ప్రజలకు నాణ్యమైన మాంసం అందించాలని సూచించారు. త్వరలోనే వాల్మీకి నగర్లో ఉన్న వధశాలను తరలించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి:వెల్లువలా నకిలీ శానిటైజర్లు.. ఆల్కహాల్‌కు బదులు రసాయనాలు