అక్రమ నిర్మాణాలపై కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు ఉక్కుపాదం మోపారు. నిబంధనలు పాటించకుండా నిర్మించిన వాటి కూల్చివేతలకు శ్రీకారం చుట్టారు. నగరంలోని జ్యోతినగర్‌లో రెండు భవనాలకు సంబంధించిన యజమానులు సెట్‌బ్యాక్ లేకుండా నిర్మించారంటూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోగా.. వాటి ముందు భాగాలను కూల్చివేశారు.
రోడ్లను ఆక్రమించారు... అధికారులు కూల్చేశారు - నగరపాలికలో నిర్మాణాల తొలగింపు
కరీంనగర్ నగరపాలికలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝులిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని కూల్చేశారు. రోడ్ల విస్తరణలో అడ్డు వస్తున్న నిర్మాణాలను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రోడ్లను ఆక్రమించారు... అధికారులు కూల్చేశారు
రోడ్ల విస్తరణలో ప్రధానంగా సెట్‌బ్యాక్ నిబంధన పాటించని నిర్మాణాలను తొలగించారు. మరోవైపు రేకుర్తిలో అక్రమంగా నిర్మించిన సరిహద్దు గోడలను జేసీబీలతో పడగొట్టారు. రోడ్ల వెడల్పుకు అటంకంగా మారినందువల్లే నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. పట్టణ ప్రణాళిక సంఘం అధికారుల అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.