కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో నూతనంగా ఏర్పడిన వాసుదేవ కాలనీలో మేయర్ సునీల్ రావు పర్యటించారు. కాలనీ సైన్ బోర్డులను ఆవిష్కరించారు. కాలనీ వాసులు అందరూ కలిసికట్టుగా ఉండి కాలనీ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. నగరపాలక సంస్థ నుంచి మరింత నిధులను సమకూర్చి కాలనీలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
'అందరూ కలిస్తేనే అభివృద్ధి సాధ్యం' - karimnagar municipal corporation mayor sunil rao
అందరూ కలిసికట్టుగా ఉండి నగర అభివృద్ధికి తోడ్పడాలని కరీంనగర్ మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలో కొత్తగా ఏర్పడిన వాసుదేవ కాలనీలో కాలనీ సైన్ బోర్డ్లను ఆవిష్కరించారు.
కరీంనగర్ మేయర్ సునీల్ రావు
అస్తవ్యస్తంగా ఉన్న రహదారులకు మరమ్మతులు చేయిస్తామని, కొన్ని నెలల్లో సీసీ రోడ్లు నిర్మిస్తామని మేయర్ తెలిపారు. మురుగు నిర్వహణకు డ్రైనేజీలు నిర్మిస్తామని చెప్పారు.