నగరంలోని రహదారుల పక్కన నిర్మించిన పాదచారుల బాటను ఆక్రమిస్తే ఇక నుంచి బాదుడు తప్పదని కరీంనగర్ మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని గీతాభవన్ చౌరస్తా నుంచి కరీంనగర్ డెయిరీ వరకు ఆక్రమించిన పాదచారుల నడకదారులను ఖాళీ చేయాలని మేయర్ వ్యాపారస్తులను కోరారు.
పుట్‌పాత్‌లు ఆక్రమిస్తే కఠిన చర్యలు: సునీల్ రావు
నగరంలో పుట్‌పాత్‌లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ మేయర్ సునీల్ రావు హెచ్చరించారు. స్మార్ట్ సిటీలో భాగంగా రహదారుల పక్కన నిర్మించిన నడకదారులను నగరపాలక కమిషనర్ వల్లూరు క్రాంతి, మేయర్ పరిశీలించారు.
పుట్‌పాత్‌లను పరిశీలిస్తున్న నగరపాలక కమిషనర్ వల్లూరు క్రాంతి
మూడు రోజుల పాటు క్యాంపు నిర్వహించి అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు. వ్యాపారస్తులు సహకరించపోతే ఆన్లైన్లో అపరాధ రుసుము వసూలు చేయడానికి ఏర్పాట్లు చేస్తామని ఆయన వెల్లడించాకరు. ఇప్పటికైనా దుకాణ యజమానులు నగరపాలక సంస్థ నియమాలను పాటించాలని సునీల్ రావు స్పష్టం చేశారు.