తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లాస్టిక్​ నిషేధంలో హోటల్​ ముందడుగు - కరీంనగర్ మున్సిపల్​ కమిషనర్​ వేణుగోపాల్​ రెడ్డి

కరీంనగర్​లోని ఓ హోటల్​ యాజమాన్యం ప్లాస్టిక్​ నివారణ లక్ష్యంగా మందుడుగు వేసింది. ఆ యాజమాన్యం బట్ట సంచులు వాడడంపై మున్సిపల్​ కమిషనర్​ వేణుగోపాల్​ రెడ్డి ప్రశంసించారు.

ప్లాస్టిక్​ నిషేధంగా హోటల్​ ముందడుగు.. అధికారి ప్రశంసలు

By

Published : Oct 30, 2019, 3:01 PM IST

ప్లాస్టిక్​ నిషేధంగా హోటల్​ ముందడుగు.. అధికారి ప్రశంసలు
కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ నివారణ ధ్యేయంగా ఏర్పాట్లను చేస్తున్నామని మున్సిపల్​ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని గీతా భవన్​ హోటల్ యాజమాన్యం బట్ట సంచులను వాడడంపై అభినందించారు. హోటల్​​కు స్వయంగా వెళ్లి యజమానికి పుష్పగుచ్ఛం ఇచ్చి ప్రశంసించారు.

ప్లాస్టిక్​ కవర్లకు బదులు టిఫిన్​ బాక్స్​తో వచ్చిన వారికి మిఠాయిలలో రాయితీ ఇవ్వాలని ఈ సందర్భంగా వేణుగోపాల్​ రెడ్డి కోరారు. అందుకు హోటల్​ యజమాని సందీప్ అంగీకరించారు. మిగతా హోటళ్ల యాజమాన్యాలు ముందుకు రావాలని కమిషనర్​ పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details