రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు తెరాసకే పట్టం కడుతున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నగరపాలక కోఆప్షన్ ఎన్నికల్లో అయిదు స్థానాలకుగాను మజ్లిస్ ఒకటి, తెరాస నాలుగు స్థానాలను కైవసం చేసుకొంది. చేతులెత్తే పద్ధతిన ఓటింగ్ నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్ ఎక్స్‌అఫీషియో సభ్యునిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కరీంనగర్ నగరపాలక కో ఆప్షన్ ఎన్నికల్లో తెరాసకు 4 స్థానాలు - మంత్రి గంగుల కమలాకర్ వార్తలు
కరీంనగర్ నగరపాలక కోఆప్షన్ ఎన్నికల్లో అయిదు స్థానాలకుగాను తెరాస నాలుగు స్థానాలను కైవసం చేసుకొంది. మరో స్థానం మజ్లిస్ దక్కించుకుంది. మంత్రి గంగుల కమలాకర్ ఎక్స్‌అఫీషియో సభ్యునిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గెలుపొందిన అభ్యర్థులను మంత్రి అభినందించారు.
karimnagar municipal
3 జనరల్ స్థానాలకు తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడగా అజీత్‌రావు, నందెల్లి రమ, పుట్టా నరేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మైనార్టీ కోఆప్షన్ సభ్యులుగా తెరాస నుంచి అంజద్ అలీ, మజ్లిస్ నుంచి రఫియా సుల్తానా ఎన్నికయ్యారు. మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు మేయర్ సునీల్‌రావులు గెలుపొందిన అభ్యర్థులను అభినందించారు. కమిషనర్ క్రాంతి ప్రమాణస్వీరం చేయించారు.