తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ వార్తలను నమ్మెద్దు: ఎమ్మెల్యే గంగుల - తాగునీటి సమస్య

కరీంనగర్​ నగరంలో తాగునీటి సమస్య ఉందంటూ ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని కరీంనగర్​ ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో నాలుగు నెలలకు సరిపడా తాగునీరు అందుబాటులో ఉందని నగర వాసులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఆ వార్తలను నమ్మెద్దు: ఎమ్మెల్యే గంగుల

By

Published : Jul 12, 2019, 8:08 PM IST

కరీంనగర్​ జిల్లా మానేరు తీరంలోని నీటిశుద్ధి కేంద్రంలో తాగునీటి లభ్యతపై అధికారులతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ సమీక్షించారు. మానేరు డ్యాంలో నాలుగు నెలలకు సరిపడా తాగునీరు ఉందని, ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నగరంలో తాగునీటి సమస్య నెలకొందని ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. ఆ వార్తలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. అక్టోబర్​ నుంచి మిషన్​ భగీరథ ద్వారా ఇంటింటికి రోజువారి తాగునీరు సరఫరా చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. ఈ సమీక్షలో నగర పాలక సంస్థ కమిషనర్​ వేణుగోపాల్​ రెడ్డి పాల్గొన్నారు.

ఆ వార్తలను నమ్మెద్దు: ఎమ్మెల్యే గంగుల

ABOUT THE AUTHOR

...view details