కరీంనగర్ నగరాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని మేయర్ సునీల్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని 24వ డివిజన్‌లో కార్పొరేటర్ తిరుపతితో కలిసి భూగర్భ డ్రైనేజీ పనులకు ఆయన భూమి పూజ చేశారు.
భూగర్భ డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసిన మేయర్ - కరీంనగర్ మున్సిపాలిటీ సమాచారం
డ్రైనేజీ సమస్యతో కరీంనగర్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని 24 వ డివిజన్‌లో రూ. 25 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు.
![భూగర్భ డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసిన మేయర్ karimnagar Mayor who worshiped the earth for underground drainage works](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10835361-294-10835361-1614666844605.jpg)
భూగర్భ డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసిన మేయర్
నగరంలో అంతర్గత రోడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని మేయర్ సునీల్ రావు అన్నారు. 24 వ డివిజన్‌లో మురికి కాలువల సమస్యతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారి ఆరోగ్యం దృష్ట్యా రూ. 25 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపడుతున్నామన్నారు. ఈ పనులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి:రిజిస్ట్రేషన్లపై తర్జనభర్జనలు.. ప్రారంభ ప్రక్రియ కసరత్తులో అధికారులు