దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ లోని కార్ఖానా గడ్డ శ్మశాన వాటికను నగరపాలక సంస్థ మేయర్ వై సునీల్ రావు సందర్శించారు. దీపావళి సందర్భంగా శ్మశాన వాటికలో పూర్వీకులను తలుచుకొని ఆయా కుటుంబాల సభ్యులు వినూత్నంగా పూజలు చేస్తారు. దీపావళి పండుగను సమాధుల మధ్య ఘనంగా జరుపుకుంటారు.
శ్మశాన వాటికను సందర్శించిన మేయర్ - కరీంనగర్ లో శ్మశాన వాటికను సందర్శించిన మేయర్
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్మశాన వాటికను నగరపాలక సంస్థను మేయర్ సునీల్ రావు సందర్శించారు. దీపావళి సందర్భంగా శ్మశాన వాటికలో పూర్వీకులను తలుచుకొని ఆయా కుటుంబాల సభ్యులు వినూత్నంగా పూజలు చేస్తారు.

శ్మశాన వాటికను సందర్శించిన మేయర్
ఈసారి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ పనులన్నీ చేసేందుకు మేయర్ సునీల్ రావు చొరవ తీసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సమాధుల స్థలాల్లో చెట్లు, చెత్తను తొలగిస్తున్నారు. దీపావళి రోజు ఘనంగా పూజలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని మేయర్ తెలిపారు.