తెలంగాణ

telangana

ETV Bharat / state

డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయండి: సునీల్​ రావు

స్మార్ట్ రోడ్లును, అసంపూర్తి డ్రైనేజీలను వెంటనే పూర్తి చేయాలని కరీంనగర్​ మేయర్ సునీల్ రావు స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్​కు ఆదేశాలు జారీ చేశారు. స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా కలెక్టరెట్ స్మార్ట్ రోడ్డును పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

karimnagar mayor sunil rao visit smart roads
డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయండి: సునీల్​ రావు

By

Published : Jul 2, 2020, 6:35 PM IST

కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా కలెక్టరెట్ స్మార్ట్ రోడ్డును మేయర్ సునీల్ రావు పరిశీలించారు. కొనసాగుతున్న స్మార్ట్ రోడ్ ఫుట్ పాత్ పనులతోపాటు.. అక్కడక్క స్మార్ట్ డ్రైన్ నిర్మించని ప్రదేశాలు, శిథిలమైన పాత డ్రైన్​ను చూశారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్మార్ట్ రోడ్లు నిర్మించే శివ థియేటర్ రోడ్, కలెక్టరెట్ రోడ్లలో అసంపూర్తిగా నిర్మించిన డ్రైనేజీల కారణంగా రోడ్ల పై వరద నీరు నిలుస్తుందన్నారు. స్మార్ట్ సిటీ రోడ్ల పనులు వేగవంతం చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details