కరోనా రెండోదశ విజృంభిస్తున్న వేళ అర్హులైన ప్రతి ఒక్కరు టీకాలు తీసుకోవాలని కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావు సూచించారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీలోని కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లో ఆయన టీకా వేయించుకున్నారు.
'కొవిడ్ రహిత రాష్ట్రం కోసం అందరూ సహకరించాలి' - కరీంనగర్ మేయర్ వార్తలు
ప్రభుత్వం వ్యాక్సిన్ను అందరికీ ఉచితంగా అందిస్తుందని... ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని కరీంనగర్ మేయర్ కోరారు. కొవిడ్ రహిత రాష్ట్రం కోసం అందరూ సహకరించాలని కోరారు.

'కొవిడ్ రహిత రాష్ట్రం కోసం అందరూ సహకరించాలి'
రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ను అందిస్తుందని.. ఈ నేపథ్యంలో అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సునీల్ తెలిపారు. కొవిడ్ రహిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అపోహలను వీడి ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలన్నారు.
ఇదీ చూడండి:పడక లభించక కారులోనే కరోనా రోగి మృతి