కరీంనగర్ నగరపాలక సంస్ధ పరిధిలో వీధివ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మేయర్ సునీల్‌రావు తెలిపారు. నగరంలో చాలా చోట్ల ఫుట్‌పాత్‌లపై కూరగాయలు విక్రయిస్తున్నారని వారి వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోందని ఆయన అన్నారు. అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వెండింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ తెలిపారు.
Mayor sunilrao: వెండింగ్ జోన్ల నిర్మాణ పనులకు మేయర్ శంకుస్థాపన - కరీంనగర్ జిల్లా కేంద్రంలో వెండింగ్ జోన్ల ఏర్పాటు
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో 25 లక్షల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న వెండింగ్ జోన్ల నిర్మాణ పనులకు మేయర్ సునీల్ రావు శంకుస్థాపన చేశారు.

వెండింగ్ జోన్ల నిర్మాణ పనులకు మేయర్ శంకుస్థాపన
ఆ పనుల కోసం 25 లక్షల రూపాయలతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామన్న మేయర్ ఆ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం సిరిసిల్ల రోడ్డుతో పాటు అంబేద్కర్ స్టేడియం, శాతవాహన వర్సిటీల వద్ద నిర్మాణపు పనులు చేస్తున్నామన్నారు. అవసరమైన అన్ని ప్రాంతాల్లో వెండింగ్ జోన్లు నిర్మించనున్నట్లు మేయర్ సునీల్ రావు వివరించారు.
ఇదీ చూడండి:Suicide: కరోనా టీకా వేసుకోమన్నారని.. యువకుడు ఆత్మహత్య
TAGGED:
కరీంనగర్ మేయర్ సునీల్‌రావు