వర్షాకాలం వస్తున్న తరుణంలో కరీంనగర్ నగరపాలక సంస్థ ముందస్తు చర్యలు చేపట్టింది. విస్తృతంగా వర్షాలు కురిసిన సందర్భంలో నీరు సునాయాసంగా వెళ్లకపోవడంతో… ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చే అవకాశం ఉంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన కాల్వలను శుభ్రం చేయాలని మేయర్ సునీల్ రావు(karimnagar mayor sunil rao) సిబ్బందికి తెలిపారు.
mayor sunil rao: ప్రధాన కాల్వలను శుభ్రం చేయాలి - కరీంనగర్ తాజా వార్తలు
వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో కరీంనగర్ నగరంలోని ప్రధాన కాల్వలను శుభ్రం చేయాలని మేయర్ సునీల్ రావు(karimnagar mayor sunil rao) సిబ్బందికి తెలియజేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇళ్లలోకి నీరు రాకుండా ముందస్తుగా చర్యలు ప్రారంభించాలని సూచించారు.
mayor sunil rao: ప్రధాన కాల్వలను శుభ్రం చేయాలి
కరీంనగర్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో కాల్వలు శుభ్రం చేసేందుకు 29 లక్షల రూపాయలతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామని ఆయన చెప్పారు. వీక్లీ మార్కెట్‌లో ఈ ప్రక్రియ ప్రారంభించామని త్వరలోనే నగరంలోని వర్షపు నీటి కాల్వలు శుభ్రం చేయడంతోపాటు… కాల్వలు లేని ప్రాంతాల్లో కొత్తవి కూడా నిర్మించనున్నట్లు మేయర్ వివరించారు.
ఇదీ చూడండి:మానవత్వం చాటుకున్న పోలీసులు