ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లోని 40వ డివిజన్లో కార్పొరేటర్ భూమ గౌడ్‌తో కలిసి మేయర్ సునీల్ రావు మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నగరవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే పక్రియ కొనసాగుతోందన్నారు. యుద్ధ ప్రాతిపదికన పన్నెండు లక్షల మొక్కలు నాటేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.
హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన మేయర్ సునీల్‌రావు - ఆరో విడత హరితహారం
కరీంనగర్లో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే ప్రక్రియ కొనసాగుతోందని మేయర్ సునీల్‌రావు అన్నారు. నగరంలోని 40వ డివిజన్లో కార్పొరేటర్‌తో కలిసి ఆయన మొక్కలు నాటారు. కరీంనగర్ నగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల రక్షణ కోసం లక్ష రూపాయల చెక్కు అందజేసిన గండ్ర వెంకటేశ్వరరావు కుటుంబీకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పటికే నగర వ్యాప్తంగా ఖాళీ ప్రదేశాల్లో మియావాకి పద్ధతిలో చిట్టడవుల పెంపకం, అవెన్యూ ప్లాంటేషన్ పద్ధతిలో పలుచోట్ల మొక్కలు నాటామన్నారు. నాటిన ప్రతి మొక్కను రక్షించుకునే బాధ్యత పౌరులపై ఉందన్నారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ సహాయనిధికి నగరానికి చెందిన గండ్ర వెంకటేశ్వరరావు కుటుంబీకులు లక్ష రూపాయల విరాళాన్ని అందించారు. నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల రక్షణ కోసం లక్ష రూపాయలు అందజేయడం అభినందనీయమని మేయర్ అన్నారు. ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి:హుజూరాబాద్ నియోజకవర్గంలో భట్టి విక్రమార్క పర్యటన