హరితహారంలో భాగంగా కరీంనగర్‌లోని 31వ డివిజన్లో నగర పాలక సంస్థ మేయర్ యాదగిరి సునీల్ రావు, నగరపాలక కమిషనర్ క్రాంతి వల్లూరి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ లెక్కల స్వప్న వేణు, కాలనీవాసులు పాల్గొన్నారు. కాలనీలో ఇంటింటికీ ఆరు రకాల మొక్కలను పంపిణీ చేస్తున్నామని మేయర్ అన్నారు.
'ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి'
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్‌రావు అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లోని 31వ డివిజన్లో మేయర్‌తో పాటు నగరపాలక కమిషనర్ క్రాంతి వల్లూరి, కార్పొరేటర్ స్వప్న మొక్కలు నాటారు.
'సమతుల్యమైన వాతావరణం నెలకొల్పేందుకు ప్రజలు ముందుకు రావాలి'
ప్రతి ఒక్కరు ఇంటి ముందు కానీ, ఆవరణలో కానీ మొక్కలను నాటి సంరక్షించుకోవాలని సూచించారు. సమతుల్యమైన వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మేయర్ కోరారు.
ఇవీ చూడండి: తెలంగాణలో పచ్చదనం బాగా పెరిగింది: గోపీచంద్