స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా చేపడుతున్న నిర్మాణాల్లో... నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కరీంనగర్ మేయర్ సునీల్ రావు అధికారులకు ఆదేశించారు. నిర్లక్ష్యాన్ని ఏమాత్రం ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. నగరంలోని ఒకటవ డివిజన్ తీగల గుట్టపల్లిలో రూ. 12 లక్షలు, 12వ డివిజన్ వాసుదేవ కాలనీలో రూ. 12 లక్షలతో చేపడుతున్న పనులకు... ఆయా డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి సునీల్ రావు భూమి పూజ చేశారు.
Mayor:'నాణ్యతా ప్రమాణాల్లో... నిర్లక్ష్యాన్ని సహించేదే లేదు' - telangana news
స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా చేపడుతున్న నిర్మాణాల నాణ్యతా ప్రమాణాల్లో... నిర్లక్ష్యాన్ని ఏమాత్రం ఉపేక్షించరాదని కరీంనగర్ మేయర్ సునీల్ రావు అధికారులకు ఆదేశించారు. బాధ్యతా రాహిత్యాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించేదిలేదని హెచ్చరించారు. నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.
కరీంనగర్ మేయర్ సునీల్ రావు
శివారు ప్రాంతాల్లోని కాలనీలను అభివృద్ధి చేస్తామని మేయర్ అన్నారు. నగరంలో చేపడుతున్న సీసీ రహదారులు, మురికి కాల్వల నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలతో... చేపట్టాలని అధికారులను హెచ్చరించారు. పర్యవేక్షణ తప్పకుండా ఉండాలని సూచించారు. అభివృద్ధి పనులకు నగరవాసులు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి:CM KCR: సర్పంచ్‌తో ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్