కరీంనగర్ స్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టబోయే పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయని నగర పాలక మేయర్ యాదగిరి సునీల్ రావు(karimnagar mayor sunil rao) అన్నారు. నగరంలోని 11వ డివిజన్లో నూతన మంచి నీటి పైప్లైన్ పనులకు కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్యతో కలిసి భూమి పూజ చేశారు.
mayor sunil rao: పైప్లైన్ పనులకు భూమి పూజన చేసిన మేయర్ - కరీంనగర్ స్మార్ట్ సిటీ
కరీంనగర్ స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలోని 11వ డివిజన్లో నూతన మంచి నీటి పైప్లైన్ పనులకు మేయర్ యాదగిరి సునీల్ రావు(karimnagar mayor sunil rao), కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్యతో కలిసి భూమి పూజ చేశారు.
mayor sunil rao: పైప్లైన్ పనులకు భూమి పూజన చేసిన మేయర్
పనులు త్వరితగతిన పూర్తిచేసి కాలనీ వాసులకు తాగు నీరు అందిస్తామని ఆయన అన్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు కరుసున్న నేపథ్యంలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని కోరారు. కొవిడ్ కట్టడి కోసం ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని నగరవాసులను కోరారు.
ఇదీ చూడండి:Eatala: వారం రోజుల్లో దిల్లీ వెళ్లి భాజపాలో చేరుతా: ఈటల