మొక్కలను కాపాడుకోవడానికి నగరపాలక సంస్థ కొనుగోలు చేసిన 8 ట్రాక్టర్లను కరీంనగర్ మేయర్ సునీల్‌రావు ప్రారంభించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో అన్ని పనులను యంత్రాల ద్వారానే చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
'మొక్కలు నాటడమే కాదు.. సంరక్షణా మన బాధ్యతే' - telangana news
హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీరందించేందుకు కరీంనగర్ నగరపాలికలో 8 ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. మొక్కలు నాటడమే కాకుండా.. వాటిని పరిరక్షించుకోవడం మన బాధ్యత అని మేయర్ సునీల్ రావు తెలిపారు.
కరీంనగర్ మేయర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, కరీంనగర్ నగరపాలిక
ప్రస్తుతం మొక్కలకు నీరందించేందుకు రూ.65 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసినట్లు మేయర్ చెప్పారు. నగరంలో నీటి సరఫరాకు ఎప్పుడైనా అనుకోని అవాంతరాలు ఏర్పడితే.. ట్రాక్టర్లను వినియోగించేందుకు వీలు పడుతుందని వివరించారు.