కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని శివారు ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటైన డివిజన్ల కోసం 6 నూతన ట్రాక్టర్లను మేయర్ సునీల్ రావు ప్రారంభించారు. పారిశుద్ధ్య పనుల కోసం వాటిని ఆయా డివిజన్లకు అప్పగించేందుకు ట్రాక్టర్లకు మేయర్ పూజలు చేశారు.
కరీంనగర్లో నూతన ట్రాక్టర్లను ప్రారంభించిన మేయర్ - 6 new tractors for sanitation in karimnagar
కరీంనగర్లో పారిశుద్ధ్య పనుల కోసం 6 నూతన ట్రాక్టర్లను మేయర్ సునీల్ రావు ప్రారంభించారు. నగరంలో స్వచ్ఛత, ప్రజల ఆరోగ్యం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మేయర్ పేర్కొన్నారు.
Breaking News
రహదారులపై చెత్తను ఎప్పటికప్పుడు తీసేందుకు డంపర్ బిన్స్‌ను కార్మికులకు సునీల్‌రావు అందించారు. ఆరు వాహనాలు కార్పొరేషన్ పరిధిలో అద్దెకు నడుస్తున్నాయని.. వాటివల్ల నగరపాలక సంస్థపై భారం పడుతుండటంతో కొత్త ట్రాక్టర్లు కొనుగోలు చేశామని ఆయన తెలిపారు. నగరంలో స్వచ్ఛతే ధ్యేయంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఐటీఐఆర్ రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం: వివేక్