భారతదేశాన్ని అంగవైకల్య రహితంగా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని... కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని గౌతమి నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు ఆయన పోలియో చుక్కలు వేశారు.
'అంగవైకల్యంతో జీవితాంతం బాధ.. చుక్కలు వేయించాలి'
అంగవైకల్యం జీవితాంతం బాధ పెడుతుందని.. కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావు అన్నారు. తల్లిదండ్రులు గుర్తించి చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు ఆయన పోలియో చుక్కలు వేశారు.
అంగవైకల్యం జీవితాంతం బాధ పెడుతుంది: మేయర్ సునీల్ రావు
అంగవైకల్యం అనేది జీవితాంతం బాధ పెడుతుందని... మేయర్ తెలిపారు. తల్లిదండ్రులు గుర్తించి చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో చుక్కలను వేయించేందుకు చిన్నారుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో క్యూలో నిలబడ్డారు.
ఇదీ చదవండి: భవిష్యత్తులో పిల్లలకు ఎలాంటి జబ్బులు రావు : ఇంద్రకరణ్ రెడ్డి