కరీంనగర్ నగరాన్ని రూ.వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని... రాబోయే రోజుల్లో అందమైన సిటీగా రూపుదాల్చుతుందని కరీంనగర్ మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని వావిలాలపల్లిలో రూ.10 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రహదారి పనులకు కార్పొరేటర్ బండారి వేణుతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. అసంపూర్తిగా ఉన్న రహదారులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని... నాణ్యత లోపాలు లేకుండా ఈసారి రోడ్లు నిర్మించనున్నట్లు చెప్పారు.
రూ.వందల కోట్లతో కరీంనగర్ అభివృద్ధి: మేయర్ సునీల్ రావు - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
కరీంనగర్లోని వావిలాలపల్లిలో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు పనులకు మేయర్ సునీల్ రావు భూమి పూజ చేశారు. అసంపూర్తిగా ఉన్న రహదారులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని... అందుకే ఈసారి నాణ్యత ప్రమాణాలతో రోడ్ల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
రూ.వందల కోట్లతో కరీంనగర్ అభివృద్ధి: మేయర్ సునీల్ రావు
ప్రజలు రహదారులపై ర్యాంపులు కట్టవద్దని సూచించారు. నగర అభివృద్ధికి సహకారం అందిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:కరోనా మహమ్మారితో మహిళలకు కొత్త కష్టాలు