తెలంగాణ

telangana

ETV Bharat / state

Karimnagar: కరీంనగర్​లో రోడ్డు నిర్మాణానికి మేయర్​ శంకుస్థాపన - రోడ్డు నిర్మాణానికి మేయర్​ శంకుస్థాపన

కరీంనగర్​లో అంతర్గత రోడ్డు నిర్మాణానికి మేయర్​ సునీల్​రావు శంకుస్థాపన చేశారు. నగరంలో రహదారుల పనులు ఇప్పటికే 70 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా కరోనా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

KARIMNAGAR MAYOR SUNIL RAO CONCRETING TO ROAD CONSTRUCTING WORKS IN MANKAMMA THOTA
కరీంనగర్​లో రోడ్డు నిర్మాణానికి మేయర్ శంకుస్థాపన

By

Published : Jun 9, 2021, 5:32 PM IST

స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్​లో అంతర్గత రహదారుల నిర్మాణం చేపడుతున్నామని నగర మేయర్ సునీల్ రావు తెలిపారు. 54వ డివిజన్ మంకమ్మ తోటలో రోడ్డు పనులకు కార్పొరేటర్​తో కలిసి శంకుస్థాపన చేశారు. నగరంలోని రహదారులు ఇప్పటికే 70 శాతం వరకు పూర్తయ్యాయని మేయర్ వెల్లడించారు. మిగతా వాటిని త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

కరీంనగర్ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని మేయర్​ కోరారు. కాలనీల్లో, ఇళ్ల ముందు, రోడ్డుపై ర్యాంపులు వేయడం వల్ల సీసీ రోడ్ల పనులకు ఇబ్బందిగా మారిందని అన్నారు. రహదారుల నిర్మాణానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని... బాధ్యతగా మాస్కులు ధరించాలని, అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావొద్దని సునీల్​ రావు సూచించారు.

ఇదీ చదవండి:Vaccination: పిల్లలకు అన్ని టీకాలు వేయాల్సిందే..!

ABOUT THE AUTHOR

...view details