తెలంగాణ

telangana

ETV Bharat / state

'10 నిముషాలు పని చేయండి... సీజనల్​ వ్యాధులను తరిమికొట్టండి' - సీజనల్ వ్యాధులపై కరీంనగర్​ మేయర్

మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అందరూ ఆదివారం పది నిముషాల కార్యక్రమంలో పాల్గొనాలని కరీంనగర్​ మేయర్ వై.సునీల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని పలు కాలనీల్లో తిరుగుతూ సీజనల్​ వ్యాధులపై అవగాహన కల్పించారు.

karimnagar mayor sunil on sesional dises
'10 నిముషాలు పని చేయండి... సీజనల్​ వ్యాధులను తరిమికొట్టండి'

By

Published : Aug 9, 2020, 2:48 PM IST

సీజనల్ వ్యాధులపై నగర ప్రజల్లో చాలా అవగాహాన వచ్చిందని కరీంనగర్​ నగర మేయర్ వై.సునీల్ వెల్లడించారు. ఆదివారం 10 గంటలకు 10 నిముషాలు అంటూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 33వ డివిజన్​లో ఆయన పర్యటించారు.

పలు నివాసగృహాలు సంద్శించి... పూల కుండీలు, వాడని ఖాళీ డబ్బాల్లో నీటిని తొలగించారు. సీజనల్ వ్యాధులు, దోమల నివారణ అంశాలపై ఇంటి యజమానులకు అవగాహాన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా కుంటుంబ సభ్యులు, చుట్టు పక్కల ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటారని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:'కాపాడే క్రమంలో తెలిసింది..వీరంతా కరోనా బాధితులని'

ABOUT THE AUTHOR

...view details