కరీంనగర్ డివిజన్లలో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తిన నగరపాలక సంస్థ ఆద్వర్యంలో పరిష్కరిస్తామని నగర మేయర్ సునీల్ రావు తెలిపారు. నాలుగో రోజు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా సోమవారం కరీంనగర్ 42వ డివిజన్‌లో పర్యటించారు. కార్పొరేటర్ మేచినేని వనజ అశోక్ రావుతో కలిసి పాదయాత్ర చేశారు.
డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాలు, శ్మశానవాటికలోని పలు సమస్యలను కార్పొరేటర్ మేయర్ సునీల్ దృష్టికి తెచ్చారు. మేయర్ సునీల్ రావు డ్రైనేజీ సమస్యలను పరిశీలించి అనంతరం శ్మశాన వాటికను సందర్శించారు. శ్మశాన వాటికలో ఉన్న ప్రహరిగోడ నిర్మాణం, గేటు తదితర సమస్యలను పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.